కరపలో నాలుగు పంచాయతీలు పూర్తి ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-02-05T06:32:24+05:30 IST

కరప మండలంలో పెనుగుదురు, గురజనాపల్లి, వేములవాడ, కొంగోడు గ్రామపంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమైనట్టు అధికారులు తెలిపారు.

కరపలో నాలుగు పంచాయతీలు పూర్తి ఏకగ్రీవం

కరప, ఫిబ్రవరి 4: కరప మండలంలో పెనుగుదురు, గురజనాపల్లి, వేములవాడ, కొంగోడు గ్రామపంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవమైనట్టు అధికారులు తెలిపారు. గురజనాపల్లి, వేములవాడ పంచాయతీల సర్పంచ్‌, వార్డు స్థానాలకు ఒక్కో నామినేషన్‌ పడగా, పెనుగుదురు, కొంగోడు గ్రామాల్లోని వార్డులకు పలు నామినేషన్‌లు దాఖలయ్యాయి. ఉపసంహరణకు చివరిరోజున ఆయా స్థానాలకు ఒక్కో అభ్యర్థి మాత్రమే బరిలో నిలిచారు. దీంతో ఆ నాలుగు పంచాయతీల ఎన్నిక ఏకగ్రీవమైనట్టు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ నాలుగు సర్పంచ్‌ స్థానాలు వైసీపీ ఖాతాలోకి చేరాయి. గురజనాపల్లిలో 12 వార్డులను పొత్తుల్లో భాగంగా వైసీపీ, టీడీపీ, జననసేన పార్టీలు సమానంగా పంచుకున్నాయి. వైస్‌సర్పంచ్‌ పదవిని జనసేన బలపరిచిన వార్డుసభ్యుడికి కేటాయించారు. పెనుగుదురులో 12 వార్డుల్లో రెండింటిని జనసేన పార్టీ తరపున పోటీలో నిలిచిన అభ్యర్థులకు కేటాయించారు. వేములవాడలోని 12 వార్డులు, కొంగోడులోని 10వార్డులు వైసీపీ బలపరిచిన అభ్యర్థులే దక్కించుకోవడం విశేషం.

Updated Date - 2021-02-05T06:32:24+05:30 IST