కరోనాతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మృతి

ABN , First Publish Date - 2021-05-02T13:30:24+05:30 IST

కరోనాతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు(72) మృతి చెందారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స

కరోనాతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మృతి

రాజమండ్రి: కరోనాతో మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు(72) మృతి చెందారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1984లో జడ్పీ చైర్మన్‌గా టీడీపీ తరపున రామారావు సేవలందించారు. అలాగే 1994, 2004లో పెద్దాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012-17 వరకు ఎమ్మెల్సీగా బొడ్డు భాస్కర రామారావు  పనిచేశారు. బొడ్డు భాస్కర రామారావు స్వగ్రామం పెదపూడి మండలం పెద్దాడ. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-02T13:30:24+05:30 IST