మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దీక్ష భగ్నం

ABN , First Publish Date - 2021-05-15T15:32:31+05:30 IST

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి దీక్ష భగ్నం

రాజమండ్రి: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రైతుకు మద్దతు ధర కోసం బిక్కవోలు మండలం కొంకుదురులో కాటన్ విగ్రహం వద్ద రామకృష్ణారెడ్డి దీక్షకు దిగారు. అయితే దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు దీక్షా శిబిరానికి చేరుకుని  మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రామకృష్ణను అక్కడి నుంచి బిక్కవోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-05-15T15:32:31+05:30 IST