‘అటవీ సంపద పరిరక్షణలో ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు కీలకం’

ABN , First Publish Date - 2021-11-09T05:40:09+05:30 IST

కోట్లాది రూపాయలు ఉత్పాదక విలువ కలిగిన చెట్లు, వేలాది ఎకరాల అటవీ భూమిని పరిరక్షించడంలో ఫారెస్ట్‌ బీట్‌ అధికారు ల పాత్ర కీలకమైందని అకాడమీ డైరెక్టర్‌ జెఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు.

‘అటవీ సంపద పరిరక్షణలో ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు కీలకం’

రాజానగరం, నవంబరు 8: కోట్లాది రూపాయలు ఉత్పాదక విలువ కలిగిన చెట్లు, వేలాది ఎకరాల అటవీ భూమిని పరిరక్షించడంలో ఫారెస్ట్‌ బీట్‌ అధికారు ల పాత్ర కీలకమైందని అకాడమీ డైరెక్టర్‌ జెఎస్‌ఎన్‌ మూర్తి అన్నారు. ఏపీపీ ఎస్సీ ద్వారా నూతనంగా నియమితులైన ఫారెస్టు బీట్‌ అధికారులకు దివాన్‌చె రువులోని రాష్ట్ర అటవీ శిక్షణా సంస్థలో 15 రోజులపాటు నిర్వహించనున్న శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వన చేసి ప్రారంభించారు. ఈ నెల 24వరకు అటవీ సంరక్షణ విధులపై శిక్షణ కల్పిస్తామని, రాష్ట్ర వ్యాప్తం గా 40 మంది ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు ఈ శిక్షణకు ఎంపికయ్యారని మూర్తి చెప్పారు. సాంకేతిక, విజ్ఞానపరంగా అటవీశాఖ క్షేత్రస్థాయి సిబ్బందిని బలోపే తం చేసే దిశగా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవా లని కోరారు. రాష్ట్ర సిల్వి కల్చరిస్ట్‌ ఎల్‌.భీమయ్య, డీడీలు, ఫ్యాకల్టీ సభ్యులు కె.రాజశేఖరావు, వి.శ్రీహరిగోపాల్‌, టి.చక్రపాణి, మోహన్‌రాజు, డి.ఫణికుమార్‌, ఎన్‌వీ శివరామ్‌, పీవీ మూర్తి, ఎన్‌.ప్రసాద్‌, దామోదర్‌, దివ్యజ్యోతి పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T05:40:09+05:30 IST