‘అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి’

ABN , First Publish Date - 2021-12-07T05:49:02+05:30 IST

ఆదివాసీలు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు, పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఐటీ డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

‘అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి’

రంపచోడవరం, డిసెంబరు 6: ఆదివాసీలు సేకరిస్తున్న అటవీ ఉత్పత్తులు, పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఐటీ డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీవోకు అందజేశారు. ఏఐకేఎంఎస్‌ నాయ కులు పల్లాల లచ్చిరెడ్డి మాట్లాడుతూ గతంలో వైఎస్‌ఆర్‌ క్రాంతి ద్వారా కొను గోలు చేసిన ధాన్యానికి నగదును చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఏఐకేఎంఎస్‌ నాయకులు కుంజా దూలయ్య, ఐవీ రమణ, బాలుదొర, పల్లాల ఆదిలక్ష్మి, అన్నిక పండమ్మ, సాదల విజయభాస్కర్‌రెడ్డి, కత్తుల బాలురెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T05:49:02+05:30 IST