రాష్ట్రస్థాయి జానపద నృత్య పోటీలకు ఊలపల్లి విద్యార్థులు
ABN , First Publish Date - 2021-10-30T04:50:51+05:30 IST
ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో బొమ్మూరు డైట్ కళాశాలలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి జానపద నృత్య పోటీల్లో ఊలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రథమ స్థానంలో నిలిచినట్టు హెచ్‌ఎం ఎం.చిన్నారావు తెలిపారు.

బిక్కవోలు, అక్టోబరు, 29: ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో బొమ్మూరు డైట్ కళాశాలలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి జానపద నృత్య పోటీల్లో ఊలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రథమ స్థానంలో నిలిచినట్టు హెచ్‌ఎం ఎం.చిన్నారావు తెలిపారు. సెల్‌ఫోన్ వాడకం వల్ల అనర్ధాలపై మేఘన, అనూష, సాత్విక, అఖిల్‌క్రాంతి, ప్రణీత, సత్యసాయిపూజిత, గంగాగాయిత్రి చేసిన నృత్యం అకట్టుకుంది. వీరు డైట్ ప్రిన్సిపాల్ ఎన్‌ఆర్ సుబ్రహ్మణ్యం నుంచి ప్రశంసాపత్రాలు అందుకున్నారు. త్వరలో అమరావతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటారని తెలిపారు. విద్యార్థినులను ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ పోతుల ప్రసాదరెడ్డి, సర్పంచ్ బండారు రమ్యశివ, పీఎంసీ చైర్మన్ నరసింహమూర్తి, ఉపాధ్యాయులు అభినందించారు.