వరదలను ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2021-08-03T05:56:46+05:30 IST

గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య పేర్కొన్నారు.

వరదలను ఎదుర్కొనేందుకు పటిష్ట చర్యలు

రంపచోడరం, ఆగస్టు 2: గోదావరి వరదలను ఎదుర్కొనేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు ఐటీడీఏ పీవో ప్రవీణ్‌ ఆదిత్య పేర్కొన్నారు. సోమవారం ఆయన ఐటీడీఏ కార్యాలయంలో వరదలను ఎదుర్కొనేందుకు చేపట్టే చర్యలపై సబ్‌ కలెక్టరు కె.సింహాచలం, డీఎఫ్‌వో నీషాకుమారి, ఏపీవో(జీ) పీవీఎస్‌ నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టులో ముంపు నకు గురైన గ్రామాల ప్రజలు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ద్వారా నిర్మించిన గృహా లకు వెళ్లాలని సూచించారు. అర్హులందరికీ ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ మంజూరు చేస్తామన్నారు. ఈనెల 9న ఆదివాసీ దినోత్సవం నాడు అర్హులందరికీ ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు చెప్పారు.

Updated Date - 2021-08-03T05:56:46+05:30 IST