మత్స్యకారులకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే ద్వారంపూడి

ABN , First Publish Date - 2021-12-25T05:44:56+05:30 IST

మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు.

మత్స్యకారులకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే ద్వారంపూడి

కార్పొరేషన్‌(కాకినాడ), డిసెంబరు 24: మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. ఇటీవల జగన్నాథపురం ఉప్పుటేరులో ప్రమాదవశాత్తూ బోటు దగ్ధమైన ఘటనలో బోటు యజమాని పాలెపు జయప్రకాష్‌కు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.10 లక్షల చెక్కును శుక్రవారం ఎమ్మెల్యే ద్వారంపూడి అందజేశారు. స్థానిక డి కన్వన్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకార కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి వెయ్యి గజాల స్థలాన్ని కేటాయిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ సుంకర శివప్రసన్న, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ బందన హరి, డిప్యూటీ మేయర్లు చోడిపల్లి ప్రసాద్‌, మీసాల ఉదయ్‌కుమార్‌, కార్పొరేటర్లు, మత్స్యకార ప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-25T05:44:56+05:30 IST