‘పద్మశ్రీ పొందిన తొలి జర్నలిస్టు తుర్లపాటి’

ABN , First Publish Date - 2021-01-12T05:44:13+05:30 IST

పత్రికా రంగంలో తనదైన ముద్రతో పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన తొలి జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు అని, ఆయన మరణంతో పత్రికా రంగం ఓ ధృవతారను కోల్పోయిందని సీపీ బ్రౌను మందిర నిర్వాహకుడు సన్నిదానం శాసి్త్ర అన్నారు.

‘పద్మశ్రీ పొందిన తొలి జర్నలిస్టు తుర్లపాటి’

గోదావరి సిటీ, జనవరి 11: పత్రికా రంగంలో తనదైన ముద్రతో పద్మశ్రీ పురస్కారాన్ని పొందిన తొలి జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు అని, ఆయన మరణంతో పత్రికా రంగం ఓ ధృవతారను కోల్పోయిందని సీపీ బ్రౌను మందిర నిర్వాహకుడు సన్నిదానం శాసి్త్ర అన్నారు. పత్రికా రంగంలో కాలమిస్టుగా ఆయన ముద్ర వేసుకున్నారని ప్రసంగాల్లో హాస్యం పండించి రక్తి కట్టించడంలో ఆయనే సాటని సన్నిధానం సంతాపం తెలియజేసారు. గతంలో తుర్లపాటి బ్రౌను మందిరాన్ని దర్శించి తెలుగు భాషాభివృద్ధికి అనేక సూచనలు చేసారని తెలిపారు. పత్రికలలో అచ్చుతప్పులపై ఉపన్యాసం చేయడంలోను తుర్లపాటి తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు.

Updated Date - 2021-01-12T05:44:13+05:30 IST