ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం

ABN , First Publish Date - 2021-10-29T05:24:06+05:30 IST

పి.గన్నవరంలో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చెప్పారు.

ఫైర్‌ స్టేషన్‌ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం

పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు
పి.గన్నవరం, అక్టోబరు 28: పి.గన్నవరంలో ఫైర్‌స్టేషన్‌ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిందని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు చెప్పారు. పోతవరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. ఇప్పటికే ఊడిమూడిలో రూ.49.50 కోట్లతో నిర్మాణం చేసే వంతెన ప్రస్తుతం టెండర్లు దశలో ఉందని చెప్పారు. అప్పనపల్లి ఎత్తిపోతల పథకం, అప్పనపల్లి కాజ్‌వే, తొగరపాయపై కాజ్‌వే, గోదావరితీరం వెంబడి గ్రోయిన్స్‌ నిర్మాణం సమస్యలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. అడ్డగళ్ల వెంకటసాయిరాం, దొమ్మేటి శివరామన్‌, వడలి కొండ, నూకపెయ్యి ప్రసన్నకుమార్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:24:06+05:30 IST