వ్యాక్సిన్‌ వేయించుకున్న అంగన్‌వాడీ ఆయాకు అనారోగ్యం

ABN , First Publish Date - 2021-02-01T06:24:52+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాతే అనారోగ్యానికి గురయ్యానని, అధికారులు పట్టించుకోవడం లేదని ముమ్మిడివరం నగర పంచాయతీ చిప్పలపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న ముమ్మిడివరపు సీతామహాలక్ష్మి ఆరోపించారు

వ్యాక్సిన్‌ వేయించుకున్న అంగన్‌వాడీ ఆయాకు అనారోగ్యం

ముమ్మిడివరం, జనవరి 31: కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాతే అనారోగ్యానికి గురయ్యానని, అధికారులు పట్టించుకోవడం లేదని ముమ్మిడివరం నగర పంచాయతీ చిప్పలపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న ముమ్మిడివరపు సీతామహాలక్ష్మి ఆరోపించారు. ఈనెల21న కొత్తలంక పీహెచ్‌సీలో ఆమె కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుంది. చేతులు,కాళ్లు లాగడంతో 26న ముమ్మిడివరం ఆసుపత్రిలో వైద్యం అందించి, 27న కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందించి ఆమెను 29న ఇంటికి పంపించారు. అప్పటినుంచి కాళ్లూ,చేతులు సరిగా పనిచేయడం లేదని ఆమె ఆరోపిస్తుంది. పీహెచ్‌సీ, ఐసీడీఎస్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆమె పేర్కొంది. కొత్తలంక పీహెచ్‌సీ వైద్యాధికారి బి.వినీల్‌ను వివరణ కోరగా వ్యాక్సిన్‌ వేస్తే 42గంటల్లో రియాక్షన్‌ వస్తుందని, ఆరోజు 115మందికి వ్యాక్సిన్‌ వేయగా అందరూ బాగానే ఉన్నారని తెలిపారు. సీతామహాలక్ష్మి గతం నుంచి నరాలకు సం బంధించిన వీక్‌నెస్‌తో బాధపడుతోందన్నారు. శనివారం ఆమె ఇంటికి వెళ్లి ఆరోగ్యపరిస్థితిని పరిశీలించామని, సోమవారం మళ్లీ ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి పంపించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు


Updated Date - 2021-02-01T06:24:52+05:30 IST