‘రైతులకు న్యాయం జరిగేలా కృషి’
ABN , First Publish Date - 2021-11-21T06:02:51+05:30 IST
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ రైతులకు హామీ ఇచ్చారు.

కడియం, నవంబరు 20: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ రైతులకు హామీ ఇచ్చారు. శనివారం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్‌తో కలిసి ఆయన కడియం ఆవలో పంటను పరిశీలించారు. ఈ-క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకున్న రైతులకు ఎకరాకు రూ.6 వేలు నష్టపరిహారం కింద రైతుల ఖాతాల్లో సొమ్ములు జమవుతాయని ఎంపీ చెప్పారు. మండలంలో వరి రైతులకు కలిగిన పంట నష్టాన్ని మంత్రి కన్నబాబు ద్వారా సీఎం జగన్ దృష్టికి తీసుకెళతామన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ యాదల స్టాలిన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు పాల్గొన్నారు. కాగా మండలంలో సుమారు 2,300 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అంచనా వేశామని ఏవో కళ్యాణసూర్యకుమార్ తెలిపారు.