రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2021-11-03T04:55:38+05:30 IST

అకాల వర్షాల కు నష్టపోయిన రైతు లను ప్రభుత్వం ఆదు కోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

పెదపూడి, నవంబ రు 2: అకాల వర్షాల కు నష్టపోయిన రైతు లను ప్రభుత్వం ఆదు కోవాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవా రం ఆయన పార్టీ నా యకులతో కలసి పెద పూడిలో వర్షాలకు నేలకొరిగిన, నీటమునిగిన వరి చేలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నరేళ్లుగా రైతులు తుఫానులు కారణంగా పూర్తిగా నష్టపోయారన్నారు. ప్రభుత్వమే రైతులకు పంటబీమా చెల్లిస్తుందని చెప్పి గత ఏడాది బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలను చెల్లించలేదన్నారు. రైతు భరో సా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పినా రైస్‌ మిల్లర్లు ధాన్యం కొనుగోలుచేయని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎకరాకు రూ.30 వేలు నష్టపరి హారం చెల్లించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో సర్పంచ్‌ కలవల కృష్ణమూర్తి, పుట్టా గంగా ధరచౌదరి, జుత్తుగ కృష్ణ, ఆరుమిల్లి అమ్మన్నచౌదరి, సిరసపల్లి నాగేశ్వరరావు, వల్లూరి అబ్బు, దుంగా శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-03T04:55:38+05:30 IST