రైతు, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-10-20T05:20:12+05:30 IST

రైతు, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా రెండో విడత చెక్కులను మంగళవారం డ్వాక్రా సం ఘాల మహిళలకు అందజేశారు.

రైతు, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి
బిక్కవోలు: బలభద్రపురంలో చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి

  • ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి.. ‘ఆసరా’ చెక్కుల పంపిణీ

బిక్కవోలు, అక్టోబరు 19: రైతు, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా రెండో విడత చెక్కులను మంగళవారం డ్వాక్రా సం ఘాల మహిళలకు అందజేశారు. బలభద్రపురంలో 190 మహిళా శక్తి సంఘాలకు రూ.1.79 కోట్లను పంపిణీ చేశారు. అనంతరం రైతు భరోసా కేంద్రానికి నాలుగు పవర్‌ టిల్లర్లను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బుంగా రామారావు, జడ్పీటీసీ రొంగల పద్మావతి, ఎంపీటీసీలు ఆనందరెడ్డి, వీర్రాఘవరెడ్డి, మండల వ్యవసాయ మండలి సలహా సంఘ అధ్యక్షుడు నల్లమిల్లి వెంకటరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ పోతుల ప్రసాదరెడ్డి, ఏపీఎం కె.త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:20:12+05:30 IST