రైతు సంక్షేమానికి పెద్దపీట

ABN , First Publish Date - 2021-10-15T05:16:27+05:30 IST

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వే స్తుందని డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ పేర్కొన్నారు.

రైతు సంక్షేమానికి పెద్దపీట

కడియం, అక్టోబరు 14: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వే స్తుందని డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు, వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌ పేర్కొన్నారు. గురువారం కడియ పుసావరంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్‌ యంత్ర సేవా కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథులుగా విచ్చేసి జై శ్రీరామ్‌ సంఘానికి పవర్‌టిల్లర్స్‌, పవర్‌స్ర్పేయర్‌ తదితర వ్యవసాయ పనిముట్లను అందజేశారు. కార్యక్రమంలో కొండపల్లి పట్టియ్య, యీలి గోపాలరావు, తిరుమలశెట్టి వెంకటేశ్వరరావు, సాపిరెడ్డి సూరిబాబు, తాడాల చక్రవర్తి, సంగీత వెంకటేశ్వరరావు, ఏవో కళ్యాణసూర్యకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-15T05:16:27+05:30 IST