రైతు దగా దినోత్సవం జరపండి

ABN , First Publish Date - 2021-07-09T05:28:39+05:30 IST

రెండేళ్ల పాలనలో సీఎం జగన్‌ అన్నదాతల రైతులను ఉద్దరించింది ఏమీ లేదని, ఈ ప్రభుత్వం రైతు దినోత్సవం కంటే రైతు దగా దినోత్సవం జరిపితే బాగుంటుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ విమర్శించారు.

రైతు దగా దినోత్సవం జరపండి

 రాజమహేంద్రవరం సిటీ, జూలై 8: రెండేళ్ల పాలనలో సీఎం జగన్‌ అన్నదాతల రైతులను ఉద్దరించింది ఏమీ లేదని, ఈ ప్రభుత్వం రైతు దినోత్సవం కంటే రైతు దగా దినోత్సవం జరిపితే బాగుంటుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలోను, వారి బకాయిలు చెల్లించడంలోను పూర్తిగా నమ్మించి మోసం చేసిన  సీఎం జగన్‌కు రైతు దినోత్సవం జరిపే హక్కు లేదన్నారు.  ధాన్యాగారమైన కోనసీమలో గిట్టుబాటు ధర లేక రైతులు పంట విరామం ప్రకటించారంటే ప్రభుత్వం వారి పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుందో అర్థమ వుతుందన్నారు. ఇది రైతు సంక్షేమ రాజ్యం కాదని, రైతు దగా ప్రభుత్వమని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన సూక్ష్మ సేద్యానికి రూ.1264 కోట్లు ఖర్చు చేయడం పూర్తిగా అవాస్తమని గన్ని కృష్ణ అన్నారు.

Updated Date - 2021-07-09T05:28:39+05:30 IST