రైతు పోరాటాలకు తలొగ్గిన ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2021-11-21T06:10:31+05:30 IST

కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాల సవరణలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా రైతులు చేసిన పోరాటానికి తలొగ్గి ప్రధాని మోదీ ఆ చట్టాలను రద్దు చేశారని పలువురు నాయకులు హర్షం వ్యక్తంచేశారు.

రైతు పోరాటాలకు తలొగ్గిన ప్రధాని మోదీ

  • సీపీఎం, ప్రజాసంఘాల నాయకులు
  • వ్యవసాయ చట్టాల రద్దుపై విజయోత్సవ ర్యాలీ

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 20: కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాల సవరణలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా రైతులు చేసిన పోరాటానికి తలొగ్గి ప్రధాని మోదీ ఆ చట్టాలను రద్దు చేశారని పలువురు నాయకులు హర్షం వ్యక్తంచేశారు. శనివారం రాజమహేంద్రవరంలోని నందం గనిరాజుసెంటర్‌లో సీపీఎం, సీఐటీయూ, రైతుసంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్‌ మూర్తి, రైతు సంఘం నాయకులు పడాల రామకృష్ణ మాట్లాడుతూ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చాకు, తోడ్పాటుగా ఉద్యమించిన కార్మికవర్గానికి, ప్రజాతంత్ర శక్తులకు జేజేలు తెలిపారు. ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమంలో 700 మంది రైతులు అమరులయ్యారన్నారు. రాబోయే యూపీ, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ ఎన్ని కల్లో రైతులు బీజేపీని ఓడిస్తారనే భయంతోనే ముందస్తుగా రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని ప్రకటించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు టీఎస్‌ ప్రకాష్‌, ఐద్వా, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శులు పి.తులసి, బి.రాజులోవ, సీపీఎం నాయకులు పోలిన వెంకటేశ్వరరావు, టి.సావిత్రి, సాయిబాబు, కె.రామకృష్ణ, బి.పూర్ణిమరాజు, ప్రజాసంఘాల నాయకులు వెంకటేశ్వరరావు, శ్రీను, సోమేశ్వరరావు, సతీష్‌, రాజు, తాతారావు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-21T06:10:31+05:30 IST