మౌలిక సదుపాయాలను త్వరగా పూర్తిచేయాలి
ABN , First Publish Date - 2021-11-21T06:04:13+05:30 IST
మండలంలో నిర్మిస్తున్న పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలను త్వరగా పూర్తి చేయాలని రంపచోడవరం సబ్‌కలెక్టర్ కట్టా సింహాచలం ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

గంగవరం, నవంబరు 20: మండలంలో నిర్మిస్తున్న పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలను త్వరగా పూర్తి చేయాలని రంపచోడవరం సబ్‌కలెక్టర్ కట్టా సింహాచలం ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు మండలంలోని నేలదోనెలపాడులో నిర్మిస్తున్న పునరావాస కాలనీని ఆయన శనివారం సందర్శించారు. కాలనీలోని గృహనిర్మాణాలు, మౌలిక వసతులైన వీధిరోడ్లు, డ్రైన్లు, వీధిలైట్లు, టాయిలెట్స్ నిర్మాణాలు, హెల్త్ సెంటర్ స్కూల్ భవన నిర్మాణాలను పరిశీలించి కాంట్రాక్ట్ సిబ్బందికి, ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే రాజవరంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఓటుహక్కు నమోదు కేంద్రాన్ని సబ్‌కలెక్టర్ తనిఖీ చేశారు. మండలంలోని 18 ఏళ్లు నిండిన వారికి ఓటుహక్కు నమోదుపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఓటుహక్కు నమోదు కోసం పోలింగ్ కేంద్రం వద్ద శని, ఆదివారాలు ప్రత్యేక క్యాంపేయిన్ నిర్వహిస్తామన్నారు. ఆయన వెంట తహశీల్దార్ శ్రీమన్నారాయణ ఉన్నారు.