ఏపీసెట్‌ పరీక్షకు 4835 మంది విద్యార్థుల హాజరు

ABN , First Publish Date - 2021-11-01T05:12:15+05:30 IST

ఏపీసెట్‌-2021 పరీక్షకు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలో 4835 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు ఆదివారం తెలిపారు.

ఏపీసెట్‌ పరీక్షకు 4835 మంది విద్యార్థుల హాజరు

దివాన్‌చెరువు, అక్టోబరు 31: ఏపీసెట్‌-2021 పరీక్షకు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలో 4835 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు ఆదివారం తెలిపారు. రీజియన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన  పది పరీక్షా కేంద్రాల్లో ఏపీసెట్‌ పరీక్షలు జరిగాయని చెప్పారు. ఈ కేంద్రాల్లో 5959 మంది విద్యార్థులు పరీక్షలు రాయా ల్సి ఉండగా 4835 మంది హాజరయ్యారన్నారు. హాజరుశాతం 81గా ఉందని తెలిపారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, ఎస్‌కేవీటీ కళాశాల లలోని పరీక్షాకేంద్రాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులందరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరయ్యారన్నారు. కార్యక్రయంలో ఏపీసెట్‌ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య ఎస్‌.టేకి, కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-01T05:12:15+05:30 IST