ఉద్యోగులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

ABN , First Publish Date - 2021-12-30T07:00:38+05:30 IST

సాంకేతికతను అందిపుచ్చుకుని ఉద్యోగులు ముందుకు సాగాలని ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు అన్నారు.

ఉద్యోగులు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

అమలాపురం రూరల్‌, డిసెంబరు 29: సాంకేతికతను అందిపుచ్చుకుని ఉద్యోగులు ముందుకు సాగాలని ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వసంతరాయుడు అన్నారు. స్పందనలో భాగంగా అందే ఫిర్యాదులను కాలయాపన లేకుండా టెక్నాలజీ సహకా రంతో  నిర్ణీత గడువులోగా పరిష్కరించాల్సిన బాధ్యత సిబ్బం దిపై ఉందన్నారు. స్థానిక మండలపరిషత్‌ కార్యాలయంలో అమలాపురం, అల్లవరం, ఉప్పలగుప్తం మండలాల, అమలా పురం పట్టణ డిజిటల్‌ అసిస్టెంట్లు, వీఆర్వోలకు సిటిజన్‌ సర్వీసెస్‌ పోర్టల్‌(సీఎస్పీ)పై ఒకరోజు శిక్షణా కార్యక్రమం బుధవారం నిర్వహించగా ఆర్డీవో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శిక్షణలో డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి వి.శాంతామణి, ఎంపీడీవో ఎం.ప్రభాకరరావు పాల్గొన్నారు. 
Updated Date - 2021-12-30T07:00:38+05:30 IST