స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏలేశ్వరం నగర పంచాయతీకి 30వ ర్యాంక్‌

ABN , First Publish Date - 2021-11-21T06:18:26+05:30 IST

ఏలేశ్వరం, నవంబరు 20: స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2021లో భాగంగా నిర్వహించిన సర్వేలో ఏలేశ్వరం నగర పంచాయతీకి 30వ ర్యాంక్‌ లభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో సౌత్‌జోన్‌కు సంబంధించి 25వేల నుంచి 50వేలలోపు జనాభా కేటగిరీకి సంబంధించి

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏలేశ్వరం నగర పంచాయతీకి 30వ ర్యాంక్‌

ఏలేశ్వరం, నవంబరు 20: స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2021లో భాగంగా నిర్వహించిన సర్వేలో ఏలేశ్వరం నగర పంచాయతీకి 30వ ర్యాంక్‌ లభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో సౌత్‌జోన్‌కు సంబంధించి 25వేల నుంచి 50వేలలోపు జనాభా కేటగిరీకి సంబంధించి ఏలేశ్వరానికి ఈ ర్యాంక్‌ దక్కింది. ఈ ర్యాంక్‌ పొందడానికి ప్రజల సహకారం ఎంతగానో ఉందని చైర్‌ప ర్సన్‌ అలమండ సత్యవతి, కమిషనర్‌ కె.కొండలరావు అన్నారు.


తునికి 71వ ర్యాంక్‌ 

తుని, నవంబరు 20: స్వచ్ఛ సర్వేక్షణలో తుని మున్సిపాలిటీకి 71 ర్యాంక్‌ వచ్చింది. పట్టణంలో అమలవుతున్న పారిశుధ్య కార్యక్రమాలను స్వచ్ఛ సర్వేక్షణ బృందం పరిశీలించి అవార్డుకు సిఫార్సు చేయడంతో దేశంలోని పట్టణ విభాగంలో 71 ర్యాంకును సాధించింది. ఇందుకు కృషి చేసిన అధికారులు, పారిశుధ్య సిబ్బందిని పలువురు అభినందించారు. 2019లో 33వ ర్యాంకు వచ్చింది.


సామర్లకోటకు 75వ ర్యాంకు

సామర్లకోట: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దక్షిణాది రాష్ట్రాల పరిధిలో సామర్లకోట మున్సిపాలిటీకి 75వ ర్యాంకు లభించినట్టు కమిషనర్‌ శేషాద్రి తెలిపారు. సామర్లకోటకు లక్ష జనాభాలోపు కలిగిన మున్సిపాలిటీగా ఆయా ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించి దక్షిణాది రాష్ట్రాల్లో 75వ ర్యాంకును ప్రకటించారన్నారు. ఈ ర్యాంకుతో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమాల్లో మున్సిపల్‌ సిబ్బంది కృషితో మరింత ముందంజ వేస్తామని కమిషనర్‌ చెప్పారు.

Updated Date - 2021-11-21T06:18:26+05:30 IST