ప్రజలపై విద్యుత్‌ బిల్లుల భారం: గొల్లపల్లి

ABN , First Publish Date - 2021-10-07T06:01:41+05:30 IST

రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ బిల్లులు పెనుభారంగా మారాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా విమర్శించారు.

ప్రజలపై విద్యుత్‌ బిల్లుల భారం: గొల్లపల్లి

రాజోలు, అక్టోబరు 6: రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ బిల్లులు పెనుభారంగా మారాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్రంగా విమర్శించారు. తాటిపాకలోని తన స్వగృహం వద్ద బుధ వారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్‌ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్‌ చార్జీలు పెంచబోమని మాటఇచ్చారని గుర్తు చేశారు. ఈరెండున్న రేళ్ల కాలంలో అనేకసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారన్నారు. ఎంపీపీ కేతా శ్రీనివాస్‌, టీడీపీ మండల అధ్యక్షుడు గుబ్బల శ్రీని వాస్‌, ప్రధాన కార్యదర్శి చాగంటి స్వామి, ఐటీడీపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు మానేపల్లి బాలాజీవేమా పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-07T06:01:41+05:30 IST