జాతీయ విద్యావిధానం అమలులో రాష్ట్రం ముందంజ

ABN , First Publish Date - 2021-12-30T07:22:20+05:30 IST

జాతీయ విద్యావిధానం అమలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సీఎం జగన్‌ నాయ కత్వంలో విద్యావ్యవస్థలో మార్పులు వస్తున్నాయని ఆయన చెప్పారు.

జాతీయ విద్యావిధానం అమలులో రాష్ట్రం ముందంజ
ప్రధానోపాధ్యాయుల సంఘం డైరీ ఆవిష్కరిస్తున్న మంత్రి సురేష్‌. ఎమ్మెల్యే రాజా తదితరులు

  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

దివాన్‌చెరువు, డిసెంబరు 29: జాతీయ విద్యావిధానం అమలులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సీఎం జగన్‌ నాయ కత్వంలో విద్యావ్యవస్థలో మార్పులు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రధానో పాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో నన్నయ విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌లో బుధవారం ‘జాతీయవిద్యావిధానం అమలు-ప్రధానోపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై చర్చావేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సురేష్‌, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, నన్నయ ఉప కులపతి మొక్కా జగన్నాథరావు, ఎమ్మెల్సీలు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభి వృద్ధికి సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధ వహించారని చెప్పారు. ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంపొం దించేందుకు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం తీసుకువచ్చామని తెలిపారు.  ఉపాధ్యాయ కోర్సులు, శాశ్వత శిక్షణా కార్యక్రమాలను వర్సిటీ నిర్వహిస్తుందని చెప్పారు. నాడు-నేడు కార్యక్రమానికి ఉపాధ్యాయులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. రాష్ట్ర విద్యావ్యవస్థను పటిష్టపర చేలా డీఈవో, ఎంఈవో పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ సమాజంలో గురువులకు ఎంతో గౌరవం ఉందన్నారు. నన్నయ వీసీ జగన్నాథరావు మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించడంలో గురు వుల పాత్ర కీలకమన్నారు. నూతన విద్యావిధానంలో అనేక అవకాశాలు, ప్రయోజనాలు ఉన్నాయని వాటిని అందరికీ అందించాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, పాకలపాటి రఘువర్మ, ఐ.వెంక టేశ్వరరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌, ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.వి.నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చేవూరి రవి, రాష్ట్ర సహ కార్యదర్శి కోలా సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కూర్మారావు, కోశాధికారి పి.వి.వి.సత్యనారాయణ, డివిజన్‌ అధ్యక్షుడు కె.వి.రమణారావు పాల్గొన్నారు.

సీపీఎస్‌ను రద్దు చేయాలని మంత్రి సురేష్‌కు వినతి

భానుగుడి(కాకినాడ), డిసెంబరు 29: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఏపీసీపీఎస్‌ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. దీనికి సంబంధించి సంఘ నాయకులు ఆయనకు బుధవారం వినతిపత్రం అందజేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఉద్యోగుల జీవితాలకు భద్రత కల్పించాలని కోరారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ఖాతాల్లో జమ కావాల్సిన కరువు భత్యాన్ని విడుదల చేయాలని కోరారు.


Updated Date - 2021-12-30T07:22:20+05:30 IST