‘ఇసుక’ కాంట్రాక్టర్లకు రూ.23 కోట్ల జరిమానా

ABN , First Publish Date - 2021-03-24T06:44:51+05:30 IST

డెయిరీఫారంసెంటర్‌, మార్చి 23: నిర్దేశించిన సరిహద్దులను దాటి అనుమ తులు లేని ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరిపిన నాలుగు ఇసుక రీచ్‌ల కాం ట్రాక్టర్లకు రూ.23 కోట్ల భారీ జరిమానా విధించాలని జిల్లా స్థాయి శాండ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్‌లోని కోర్టు హాల్లో మంగళవారం కలెక్టర్‌

‘ఇసుక’ కాంట్రాక్టర్లకు రూ.23 కోట్ల జరిమానా

అక్రమ తవ్వకాలపై అధికారుల ఆగ్రహం

తవ్వినదానికి 5 రెట్లు  వసూలు చేయాలని  శాండ్‌ కమిటీ నిర్ణయం

డెయిరీఫారంసెంటర్‌, మార్చి 23: నిర్దేశించిన సరిహద్దులను దాటి అనుమ తులు లేని ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరిపిన నాలుగు ఇసుక రీచ్‌ల కాం ట్రాక్టర్లకు రూ.23 కోట్ల భారీ జరిమానా విధించాలని జిల్లా స్థాయి శాండ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్‌లోని కోర్టు హాల్లో మంగళవారం కలెక్టర్‌ మురళీ ధర్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం శాండ్‌ కమిటీ సమావేశం జరిగింది. తాత పూడి, కపిలేశ్వరపురం, పులిదిండి, వేమగిరి రీచ్‌లలో సరిహద్దులను దాటి ఇసుక తవ్వకాలను జరిపిన అంశంపై సమావేశంలో చర్చించారు. నిబంధనలు అతిక్ర మించినందుకుగాను సంబంధిత నలుగురు కాంట్రాక్టర్లకు తవ్విన పరిమాణం విలువకు 5 రెట్లు మొత్తం లెక్కకట్టి రూ.23 కోట్ల జరిమానా విధించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఏపీఎండీసీ నిర్దేశించిన స్థలంలో కాకుండా వేరే స్థలంలో తవ్వకాలు జరిపినందుకు ఈ జరిమానా విధించినట్టు కమిటీ పేర్కొంది. అలాగే జిల్లాలో ఇసుక మైనింగ్‌కు అవకాశం ఉన్న 8 కొత్త రీచ్‌ల ప్రతిపాదనలను కమి టీ పరిశీలించింది. జాతీయ రహదారుల నిర్మాణానికి ఇసుక అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇసుక లోడు వాహనాలు అన్ని వేళల్లో తిరిగే ప్రతిపాదనకు కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. కోటిలింగాలు, గాయత్రి ర్యాంపులలో బోట్‌ మెన్‌ సొసైటీలను క్రమబద్దీకరించాలని ఆదేశించారు. ఏటా అక్టోబరు 1 నాటికి బోట్‌మెన్‌ సొసైటీల అనుమతులు రద్దు చేసి ఆ మాసాంతానికి కొత్త అనుమ తులు జారీ చేయాలన్నారు. పోలవరం కాలువ మట్టి తరలింపుపై మీడియాలో వచ్చిన కథనాలనూ ప్రస్తావించారు. మట్టిని టెండర్ల ద్వారా విక్రయించేలా చర్య లు తీసుకోవాలని ప్రాజెక్టు అధికారులకు సూచించారు. జేసీలు జి.లక్ష్మీశ, రాజకుమారి, రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషిక్త్‌కిశోర్‌, అమలా పురం సబ్‌ కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌, డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు, కాకినాడ ఆర్డీవో ఏజీ చిన్నికృష్ణ, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-24T06:44:51+05:30 IST