‘యువత రక్తదానం చేయడం అభినందనీయం’

ABN , First Publish Date - 2021-11-21T06:16:10+05:30 IST

సర్పవరం జంక్షన్‌, నవంబరు 20: కొవిడ్‌ వంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సైతం ఆపద సమయంలో యువత ముందుకొచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు అన్నారు. కాకినాడ రూరల్‌ పెనుమర్తిలో శ్రీకిరణ్‌ కంటి ఆసుపత్రి ఫౌండర్స్‌ డే సందర్భంగా శ్రీసంకురాత్రి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రోటరీ బ్లడ్‌బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఆయన

‘యువత రక్తదానం చేయడం అభినందనీయం’

సర్పవరం జంక్షన్‌, నవంబరు 20: కొవిడ్‌ వంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సైతం ఆపద సమయంలో యువత ముందుకొచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు అన్నారు. కాకినాడ రూరల్‌ పెనుమర్తిలో శ్రీకిరణ్‌ కంటి ఆసుపత్రి ఫౌండర్స్‌ డే సందర్భంగా శ్రీసంకురాత్రి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రోటరీ బ్లడ్‌బ్యాంకు సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్తదానంతో మరొకరికి పునర్జన్మ ప్రసాదించవచ్చనన్నారు. రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. 28ఏళ్లుగా అంధత్వ నివారణ కోసం నాణ్యమైన కంటి వైద్యాన్ని అందిస్తూ లక్షలాది మంది బాధితులకు కంటి వెలుగును డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ ప్రసాదించారని కొనియాడారు. ఈ సందర్భంగా 125 మంది విద్యార్థులు, వలంటీర్లు, సంకురాత్రి ఫౌండేషన్‌ సిబ్బంది రక్తదానం చేశారు. సర్పంచ్‌ బెజవాడ సత్యనారాయణ, ట్రస్ట్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, శ్రీకిరణ్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ అవినాష్‌ మహేంద్రకర్‌, సీఈవో కె.రాజేష్‌, రామ్‌ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-21T06:16:10+05:30 IST