పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి

ABN , First Publish Date - 2021-08-22T05:27:49+05:30 IST

కాకినాడ క్రైం, ఆగస్టు 21: జిల్లాలో పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుల సమస్యల పరిష్కారం కోసం శనివారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన సర్వీసు, సంక్షేమం, ప్రమోషన్‌, బదిలీ వంటి విషయాలపై అర్జీలు స్వీకరించారు. చర్యలు తీసుకోవాలని

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి
గ్రీవెన్స్‌లో సిబ్బంది సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ

గ్రీవెన్స్‌ నిర్వహించిన ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

కాకినాడ క్రైం, ఆగస్టు 21: జిల్లాలో పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుల సమస్యల పరిష్కారం కోసం శనివారం గ్రీవెన్స్‌ నిర్వహించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి సంబంధించిన సర్వీసు, సంక్షేమం, ప్రమోషన్‌, బదిలీ వంటి విషయాలపై అర్జీలు స్వీకరించారు. చర్యలు తీసుకోవాలని పరిపాలనా అధికారులను ఆదేశించారు. ప్రతీ శుక్రవారం నిర్వహించే గ్రీవెన్స్‌ను శుక్రవారం మొహర్రం కావడంతో ఈ రోజు నిర్వహించినట్టు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్‌ ఎస్పీ కరణం కుమార్‌, ఎస్బీ డీఎస్పీ ఎం.అంబికాప్రసాద్‌, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రామచంద్రరావు, పరిపాలనా సిబ్బంది పాల్గొన్నారు.


రియల్‌ టైం గవర్నెన్స్‌ పరిశీలన

కలెక్టరేట్‌లో నిర్మాణంలో ఉన్న రియల్‌ టైం గవర్నెన్స్‌ (ఆర్టీజీ), కాకినాడ స్మార్ట్‌సిటీ కమాండెంట్‌ కంట్రోల్‌ సెంటర్‌లను ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానించామన్నారు. ఇక్కడి సిబ్బంది అప్రమత్తంగా ఉ ంటూ సమాచారాన్ని చేరవేయడంలో వేగవంతంగా పనిచేయాలన్నారు. కా కినాడ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట మూడో పట్టణ సీఐ సీహెచ్‌ఎస్‌ రామకోటేశ్వరరావు, మేట్రిక్స్‌ సంస్థ మేనేజర్‌ రామకృష్ణ వర్మ, పోలీసు అధికారులు ఉన్నారు.

Updated Date - 2021-08-22T05:27:49+05:30 IST