AP: చెట్టును ఢీకొన్న కారు... ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-12-19T14:18:46+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి దగ్గర ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

AP: చెట్టును ఢీకొన్న కారు... ఇద్దరు మృతి

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి దగ్గర ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు చింతూరుకు చెందిన అన్నదమ్ములు గణేష్‌, సాయిగా గుర్తించారు. వీరు రాజమహేంద్రవరం నుంచి చింతూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-12-19T14:18:46+05:30 IST