నిర్భయంగా ఓటు వేయండి

ABN , First Publish Date - 2021-02-08T05:46:38+05:30 IST

తొండంగి, ఫిబ్రవరి 7: ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ కరణం కుమార్‌ సూచించారు. ఆదివారం పెరుమాళ్లపురంలో జరిగిన పోలీస్‌ కవాతులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి భయాందోళన

నిర్భయంగా ఓటు వేయండి
పెరుమాళ్లపురంలో పోలీస్‌ కవాతులో పాల్గొన్న అడిషనల్‌ ఎస్పీ, పోలీసులు

అడిషినల్‌ ఎస్పీ కరణం కుమార్‌ 

తొండంగి, ఫిబ్రవరి 7: ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ కరణం కుమార్‌ సూచించారు. ఆదివారం పెరుమాళ్లపురంలో జరిగిన పోలీస్‌ కవాతులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి భయాందోళనలు లేకుండా నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ఎటువంటి బెదిరింపులు, ఒత్తిడిలకు లోనుకాకుండా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేసుకోవాలన్నారు. ప్రజలకు అండగా పోలీసులు ఉంటారన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి ఉంచామని తెలిపారు. ఆయన వెంట పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసురావు, తుని రూరల్‌ సీఐ కె.కిశోర్‌ బాబు, ఎస్‌ఐ విద్యాసాగర్‌, వివిధ ప్రాంతాల సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-08T05:46:38+05:30 IST