ద్వారంపూడి అవినీతికి చిరునామా..

ABN , First Publish Date - 2021-10-28T05:48:41+05:30 IST

ఎమ్మెల్యే ద్వారంపూడి అవినీతికి చిరునామాగా మా రారని, అటువంటి నాయకునితో కలిసి పనిచేయడం కం టే మేయర్‌ గద్దె దిగడం ఉత్తమంగా భావిస్తున్నానని కాకినాడ పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంక ర పావని అన్నారు.

ద్వారంపూడి అవినీతికి చిరునామా..

కాకినాడ పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు పావని  

కాకినాడ సిటీ, అక్టోబరు 27: ఎమ్మెల్యే ద్వారంపూడి అవినీతికి చిరునామాగా మా రారని, అటువంటి నాయకునితో కలిసి పనిచేయడం కం టే మేయర్‌ గద్దె దిగడం ఉత్తమంగా భావిస్తున్నానని కాకినాడ పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంక ర పావని అన్నారు. కాకినాడలోని తన నివాసంలో బుధ వారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. నగరపాలక సంస్థలో సమాంతర పాలనకోసం ఎక్స్‌ అఫిషియో రూమ్‌ ఏర్పాటు చేసుకుని పెత్తనం చెలాయించలేదని ఎమ్మెల్యే ద్వారంపూ డి చెప్పగలరా అని ప్రశ్నించారు. మేయర్‌ ఎన్నిక నేరుగా జరగలేదని, కార్పొరేటర్‌గా గెలిచానని హేళన చేస్తున్న ద్వారంపూడికి రాజ్యాంగం తెలియదని, ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన వారేనన్నారు. మడ అడవుల్లో మట్టి ఫిల్లింగ్‌ కోసం కార్పొరేషన్‌ నిధుల అక్ర మాలలో అవినీతి జరిగిందన్నారు. అందులో ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. అన్ని వివరాలు త్వరలో బయట పెడతానని తెలుగు మహిళా అధ్యక్షురాలు పావని వెల్లడించారు. టీడీపీ నాయకుడు సుంకర తిరుమలకుమార్‌ పాల్గొన్నారు. 

‘సుంకర పావని ఆరోపణలు అర్థరహితం’

కార్పొరేషన్‌(కాకినాడ), అక్టోబరు 27: కాకినాడ నగర పాలక సంస్థ మా జీ మేయర్‌ సుంకర పా వని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిపై చేసిన ఆరోపణలు అర్థరహితమని డిప్యూటీ మేయర్‌లు చోడిపల్లి ప్రసాద్‌, మీసాల ఉదయ్‌కుమార్‌ ఖండించారు.  వైసీపీ కార్యాల యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో వారు మాట్లాడారు. మాజీ మేయర్‌ వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఆమె చేస్తున్న ఆరోపణలు అర్థరహిత మన్నారు. కోట్లాది రూపాయలు కార్పొరేషన్‌ పనులు చేస్తు న్న కాంట్రాక్టర్‌పై ఆరోపణలు తగవని, ఆమె ప్రవర్తన కార ణంగానే అవిశ్వాస తీర్మానంతో పదవి నుంచి తొలగిం చా రని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కార్పొరేషన్‌లో చాంబర్‌ ఏర్పాటు చేసుకున్నది పరిపాలన సౌలభ్యం కోసమేనని వ్యక్తిగత లాభం కోసం కాదన్నారు. 


Updated Date - 2021-10-28T05:48:41+05:30 IST