అసెంబ్లీలో అసలేం జరిగిందో చెప్పిన YSRCP ఎమ్మెల్యే..
ABN , First Publish Date - 2021-11-21T06:35:06+05:30 IST
అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై..

- చంద్రబాబు సతీమణిని ఏమీ అనలేదు
కార్పొరేషన్(కాకినాడ), నవంబరు 20: అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు. కాకినాడలోని డీ-కన్వక్షన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబం గురించి తాను రన్నింగ్ కామెంటరీ ఏమీ చేయలేదన్నారు.
చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడ డానికి ఎప్పుడు లేచినా వెన్నుపోటు చంద్రబాబు కూర్చో అని తాను అంటానని అన్నారు. అంతకు మించి ఆయన కుటుంబం మీద ఎటువంటి విమర్శలు చేయలేదన్నారు. తమ మంత్రులు మాట్లాడేటప్పుడు సభలో లేని ముఖ్యమంత్రిని ఉద్దేశించి బాబాయి.. గొడ్డలి.. అని రన్నింగ్ కామెంటరీ చేయించింది చంద్రబాబేనన్నారు. తనకు హెరాయిన్ లింకులు ఉన్నట్లు చంద్రబాబు మాట్లాడినప్పుడు తన భార్య, పిల్లలు బాధ పడ్డారన్నారు.
