తాగునీటి కోసం బిందెలతో ఆందోళన
ABN , First Publish Date - 2021-02-26T05:53:11+05:30 IST
యానాం పరిధిలోని వెంకట్నగర్లో నాలుగు రోజులుగా తాగునీరు అందకపోవడంతో మహిళలు బిందెలతో గురువారం ఆందోళన చేపట్టారు.

యానాం, ఫిబ్రవరి 25: యానాం పరిధిలోని వెంకట్నగర్లో నాలుగు రోజులుగా తాగునీరు అందకపోవడంతో మహిళలు బిందెలతో గురువారం ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన డ్రైనేజీ మరమత్ముల కారణంగా తాగునీటి పైప్లైన్లు దెబ్బతిన్నాయి. నాలుగురోజులైనా అధికారుల మరమత్ములు చేపట్టకపోవడంతో నీరులేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతు బిందెలతో రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. అధికారులు అక్కడికి చేరుకుని సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.