మర్రిపూడిలో డ్రైన్ల శుభ్రం

ABN , First Publish Date - 2021-12-25T05:45:59+05:30 IST

మర్రిపూడిలోని పలు డ్రైన్లను పంచాయతీ కార్మికులు శుక్రవారం శుభ్రం చేశారు.

మర్రిపూడిలో డ్రైన్ల శుభ్రం

రంగంపేట, డిసెంబరు 24: మర్రిపూడిలోని పలు డ్రైన్లను పంచాయతీ కార్మికులు శుక్రవారం శుభ్రం చేశారు. పలుచోట్ల చెత్త కాలువల్లో వేయడంతో నీటి ప్రవాహానికి అడ్డం రావడంతో సర్పంచ్‌ వేము మాధవి భర్త, వైసీపీ నాయకుడు చిరంజీవి కార్మికులతో వాటిని శుభ్రం చేయించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా డ్రైన్ల మరమ్మతులు చేయించడంతోపాటు వీధులన్నీ శుభ్రంగా ఉంచుతున్నామని సర్పంచ్‌ మాధవి తెలిపారు.

Updated Date - 2021-12-25T05:45:59+05:30 IST