కట్న వేధింపులతోనే ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-05-02T05:40:41+05:30 IST

కట్న వేధింపులే తన కుమార్తె ఆత్మహత్యకు కారణమని పూర్ణశ్రీ తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏటపాక డివిజన్‌ డీఎస్పీ ఖాదర్‌బాషా విలేఖరులతో శనివారం మాట్లాడారు.

కట్న వేధింపులతోనే ఆత్మహత్య

  • పూర్ణశ్రీ తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు

మోతుగూడెం, మే 1: కట్న వేధింపులే తన కుమార్తె ఆత్మహత్యకు కారణమని పూర్ణశ్రీ తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏటపాక డివిజన్‌ డీఎస్పీ ఖాదర్‌బాషా విలేఖరులతో శనివారం మాట్లాడారు. ఏపీ జెన్కో సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న చిట్టూరి రమేష్‌కు గత సంవత్సరం ఫిబ్రవరిలో కరప మండలం పెనుగుదురుకు చెందిన పూర్ణశ్రీతో వివాహం జరిగింది. 60 సెంట్లు భూమి, రూ.3.5లక్షల నగదు, పెళ్లి ఇతర ఖర్చుల కింద మరో రూ.90 వేలు కట్నంగా ఇచ్చారు. వివాహమై 15 నెలలు కావస్తున్నా కోడలు గర్భవతి కాలేదని, అత్తమామలు చిట్టూరి వీరవెంకట సత్యనారాయణ, వెంకటలక్ష్మి మానసికంగా వేధించేవారని, మరోపక్క ఆడపడుచు సత్యవేణి, భర్త రమేష్‌ అదనపు కట్నం కోసం వేధించేవారని తన వద్ద పూర్ణశ్రీ బాధపడినట్టు పద్మావతి తెలిపారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు. ఈ మేరకు మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2021-05-02T05:40:41+05:30 IST