డివిజన్‌లో 311 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-02T07:07:59+05:30 IST

అమలాపురం డివిజ న్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగు తోంది. కరోనా నిరా ్ధరణ పరీక్షలు తక్కువగా నిర్వహి స్తున్న ప్పటికీ పాజిటివ్‌ బారిన పడినవారి సంఖ్య అధికంగా ఉం టుంది.

డివిజన్‌లో 311 పాజిటివ్‌ కేసులు

అమలాపురం, మే 1(ఆంధ్ర జ్యోతి): అమలాపురం డివిజ న్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగు తోంది. కరోనా నిరా ్ధరణ పరీక్షలు తక్కువగా నిర్వహి స్తున్న ప్పటికీ పాజిటివ్‌ బారిన పడినవారి సంఖ్య అధికంగా ఉం టుంది. ప్రభుత్వం ఆసుపత్రుల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు తక్కువగా నిర్వహిస్తుండడంతో ప్రైవేటు ల్యాబ్‌లలో అధిక శాతం ప్రజలు పరీక్షలు చేయిం చుకుంటున్నారు. అమలా పురం డివిజన్‌లో శనివారం 311 పాజిటివ్‌ కేసులు నమోద యినట్టు అడిషనల్‌ డీఎంహెచ్‌వో డాక్టర్‌ సీహెచ్‌ పుష్కరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అత్యధికంగా అంబాజీపేట మండలంలో 57 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా రావుల పాలెంలో 56, అమలాపురం 48, మామిడికుదురు 42, అయిన విల్లిలో 32 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఐ.పోలవరంలో 9, మలికిపురం 21, ఉప్పలగుప్తం 16, సఖినేటిపల్లి 8, కొత్త పేట 8, అల్లవరం మండలంలో 14కేసులు నమోదయ్యాయి. 

కొవిడ్‌తో పాలకవర్గ సభ్యుడు వెంకటరత్నం మృతి

అమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం పాలకవర్గ సభ్యుడు మామిడిపల్లి వెంకటరత్నం(శ్రీను) శుక్రవారం రాత్రి కరోనాతో చికిత్స పొందుతూ స్థానిక శ్రీనిధి ఆసుపత్రిలో మృతి చెందారు. దేవస్థానంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలు వురికి పాజిటివ్‌ రావడంతో ఇప్పటికే వీరంతా వివిధ ఆసు పత్రులు, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 

కరోనా కట్టడికి ప్రతిజ్ఞ

అమలాపురం టౌన్‌: కొవిడ్‌ నియంత్రణకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన జరిగిన కార్యక్ర మంలో కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడు ఆధ్వర్యంలో పుర పాలక సంఘ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని పదిహేను వార్డు  సచివాలయాల వద్ద వార్డు సభ్యులు సచి వాలయ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.  వైస్‌చైర్మన్‌ తిక్కి రెడ్డి వెంకటేష్‌, కౌన్సిలర్‌ మట్టపర్తి నాగేంద్ర  పాల్గొన్నారు. 

స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు నిర్ణయం

అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు సర్క్యులర్‌ బజార్‌ వ్యాపారులు శనివారం సమా వేశం నిర్వహించి కరోనా నేప థ్యంలో వారం రోజులు షాపు లన్నీ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడికి  వినియోగదారులు సహకరించాలని సంఘ అధ్య క్షుడు జనిపిరెడ్డి సురేష్‌ విజ్ఞప్తి చేశారు.Updated Date - 2021-05-02T07:07:59+05:30 IST