జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన
ABN , First Publish Date - 2021-12-26T06:18:16+05:30 IST
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జిల్లాకు విచ్చేశారు. శుక్రవారం రాత్రి ఆయన సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం చేరుకొని బస చేశారు.

అంతర్వేది, డిసెంబరు 25 : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జిల్లాకు విచ్చేశారు. శుక్రవారం రాత్రి ఆయన సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం చేరుకొని బస చేశారు. శనివారం ఉదయం వీవీ మెరక గ్రామంలో స్కిల్ డెవలెప్‌మెంట్ సెంట ర్‌ను ఆయన ప్రారంభించారు. రాత్రి కొంతమంది ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. అత్యంత భద్రత నడుమ, ఎటువంటి ప్రచారం లేకుండా ఆయన పర్యటన సాగుతోంది. కాగా ఆదివారం ఉదయం ఆరు గంటలకు అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి విచ్చేస్తున్నట్టు సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న అనంతరం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు వెళ్లి అక్కడ జరిగే ప్రాంతీయ సదస్సులో ప్రసంగిస్తారు.