అభివృద్ధి పనులకు ధర్మకర్తల మండలి తీర్మానం

ABN , First Publish Date - 2021-07-25T05:29:40+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో వివిధ అభివృద్ధి పనులకు శనివారం ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి తీర్మానించారు.

అభివృద్ధి పనులకు ధర్మకర్తల మండలి తీర్మానం

ఆత్రేయపురం, జూలై 24: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో వివిధ అభివృద్ధి పనులకు శనివారం ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి తీర్మానించారు. ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఆలయంలో దాతల విరాళంతో నిత్యహోమశాల, ప్రదక్షిణ సపటా నిర్మించేందుకు ఏకగ్రీవంగా తీర్మానించారు. వేంకటేశ్వరస్వామి సహిత ఐశ్వర్యలక్ష్మిహోమం అర్జితసేవగా నిర్వహణ, ఆలయ ఈశాన్యభాగంలో వాహనశాల, వాహనమండపం, దీపారాధన మండపం నిర్మించేందుకు తీర్మానించారు. ఆలయ సిబ్బంది డిఫ్యూ టేషన్‌ కొనసాగేందుకు ఆమో దించారు. ఆగస్టు 17న మూడ్రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు సభ్యులు తీర్మానించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. Updated Date - 2021-07-25T05:29:40+05:30 IST