హైస్కూళ్లను తనిఖీ చేసిన డీఈవో

ABN , First Publish Date - 2021-12-31T06:07:14+05:30 IST

కరప, డిసెంబరు 30: కరప, వేళంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను గురువారం జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహాం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి ఆహారపదార్థాల నాణ్యతను పరీక్షించారు. రికార్డులను తనిఖీ చేసి ఉపాధ్యాయులు, సిబ్బంది పనితీరుపై

హైస్కూళ్లను తనిఖీ చేసిన డీఈవో

కరప, డిసెంబరు 30: కరప, వేళంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను గురువారం జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహాం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి ఆహారపదార్థాల నాణ్యతను పరీక్షించారు. రికార్డులను తనిఖీ చేసి ఉపాధ్యాయులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. విద్యార్థులతో సమావేశమై మధ్యాహ్న భోజనం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. జగనన్న విద్యాకానుక, ఇతర ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా అని అడిగితెలుసుకున్నారు. అందరూ భౌతిక దూరం పాటిస్తూ తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. హెచ్‌ఎంలు లీలాకృష్ణ, కె.భారతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-31T06:07:14+05:30 IST