ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి

ABN , First Publish Date - 2021-02-05T06:26:26+05:30 IST

ప్రజాస్వామ్య పరిరక్షణకు పోలీసు వ్యవస్థ పాటుపడుందని, నిర్భయంగా ఓటు వేసుకునేందుకు భరోసా కల్పిస్తోందని అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) కరణం కుమార్‌ తెలిపారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి

 సర్పవరం జంక్షన్‌, ఫిబ్రవరి 4: ప్రజాస్వామ్య పరిరక్షణకు పోలీసు వ్యవస్థ పాటుపడుందని, నిర్భయంగా ఓటు వేసుకునేందుకు భరోసా కల్పిస్తోందని అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) కరణం కుమార్‌ తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అత్యంత సమస్యాత్మక గ్రామం సూర్యారావుపేటలో కాకినాడ రూరల్‌ సీఐ ఆకుల మురళీకృష్ణ, తిమ్మాపురం ఎస్‌ఐ జె.విజయబాబు ఆధ్వర్యంలో ఏఎన్‌ఎస్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వు సిబ్బందితో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు ఓటు హక్కు వినిగించుకునేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలన్నారు. ఎవరైనా బెదిరింపులు, ఇబ్బందులకు గురి చేస్తే 108, ఎస్‌ఐకు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా పోలింగ్‌ సెంటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో కాకినాడ డీఎస్పీ వీ భీమారావు, పోర్టు సీఐ  పి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ మౌనిక, ఎం.నరసింహరావు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-05T06:26:26+05:30 IST