కుళ్లిన గుడ్లే విద్యార్థులకు

ABN , First Publish Date - 2021-12-09T05:46:28+05:30 IST

తాళ్లరేవు జడ్పీ హైస్కూల్‌కు కుళ్లిన గుడ్లను ఏజెన్సీ సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించు కోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

కుళ్లిన గుడ్లే విద్యార్థులకు

తాళ్లరేవు, డిసెంబరు 8: తాళ్లరేవు జడ్పీ హైస్కూల్‌కు కుళ్లిన గుడ్లను ఏజెన్సీ సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించు కోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. మంగళవారం 400గుడ్లు, బుధవారం 68గుడ్లు పాడైపోవడంతో పడవేశామని మధ్యాహ్నం భోజనం నిర్వాహకులు తెలిపారు. బుధవారం ఎండీఎం ఏడీ పి.నాగేశ్వరరావు, డీఈవో అబ్రహంలు హైస్కూల్‌కి చేరుకుని మొక్కుబడిగా విచారణ చేశారని పలువురు విమర్శిస్తున్నారు. కార్యక్రమంలో ఎంఈవో మంగాయమ్మ, హెచ్‌ఎం ఆశాలత,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.   Updated Date - 2021-12-09T05:46:28+05:30 IST