గిరిజన బిడ్డకు స్వర్ణం

ABN , First Publish Date - 2021-10-14T06:31:21+05:30 IST

మారుమూల ప్రాంతంలో జన్మించిన కుంజా రజిత పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. ఢిల్లీలో మంగళవారం జరిగిన జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజిత ప్రథమస్థానంలో నిలిచి స్వర్ణం గెలిచింది.

గిరిజన బిడ్డకు స్వర్ణం

కూనవరం, అక్టోబరు 13: మారుమూల ప్రాంతంలో జన్మించిన కుంజా రజిత పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. ఢిల్లీలో మంగళవారం జరిగిన జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజిత ప్రథమస్థానంలో నిలిచి స్వర్ణం గెలిచింది. అండర్‌-20 బాలికల 400 మీటర్ల్ల పరుగులో ఆమె ప్రథమస్థానం గెలుచుకుంది. కూనవరం మండలం రామచంద్రాపురం అడవుల్ల్లో పుట్టి పెరిగిన ఆమె అంచెలంచెలుగా క్రీడల్లో రాణిస్తూ వస్తోంది. స్వర్ణం గెలవడం తనకు ఆనందంగా ఉందని రజిత ఫోన్‌ ద్వారా ఆంధ్రజ్యోతికి తెలిపింది.

Updated Date - 2021-10-14T06:31:21+05:30 IST