ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2021-07-25T05:23:56+05:30 IST

అయినవిల్లి శ్రీసిద్ధివినాయకస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారి బొక్కా వీరవెంక టేశ్వర రావు పర్యవేక్షణలో ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు.

ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

అయినవిల్లి, జూలై 24: అయినవిల్లి శ్రీసిద్ధివినాయకస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారి బొక్కా వీరవెంక టేశ్వర రావు పర్యవేక్షణలో ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ చైర్మన్‌గా నంబూరి వెంకన్నబాబురాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ధర్మ కర్తలుగా కొత్త విజయభాస్కర రామారావు, బి.దుర్గాదేవి, ఎ.సుధారాణి, ఎం.దుర్గ, కె.సత్యవతి, కె.సత్యనారాయణ, బి.నారాయణమూర్తి, రెడ్డి గనిరాజు, ఏక్స్‌అఫిషియో సభ్యునిగా అయినవిల్లి సూర్యనారాయణమూర్తిలు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పి.తారకేశ్వరరావు తది తరులు పాల్గొన్నారు. Updated Date - 2021-07-25T05:23:56+05:30 IST