డాబా రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2021-10-15T05:18:33+05:30 IST

అచ్చంపేట సెంటర్లో గురువారం సాయంత్రం డొరాస్‌ డాబాలో గ్యాస్‌ లీకేజీతో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమా రు రూ. 5లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది.

డాబా రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం

రూ.5 లక్షల ఆస్తి నష్టం

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 14: అచ్చంపేట సెంటర్లో గురువారం సాయంత్రం డొరాస్‌ డాబాలో గ్యాస్‌ లీకేజీతో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమా రు రూ. 5లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. కాకినాడ రూరల్‌ మండలం అచ్చంపేట సెంటర్లో డొరాస్‌ పేరిట ఆట్ల నాగకృష్ణంరాజు డాబాను నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం 5.30 సమయం లో డాబాలో రెస్టారెంట్‌లో గ్యాస్‌ పొయ్యివద్ద గ్యాస్‌ సిలిండర్‌ లీకేజీ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాం తో అందులో పనిచేస్తున్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు.  అగ్ని ప్రమాద సమాచారం అందుకున్న కాకినాడ సాలిపేట అగ్నిమాపక ఏడీఎఫ్‌వో బి.ఏసురత్నం తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గ్యాస్‌ లీకేజీతో అగ్నిప్రమాదం సంభవించినట్లు ఏడీఎఫ్‌వో తెలిపారు. సుమారు రూ.5లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. సహాయక చర్యల్లో తిమ్మాపురం పోలీసులు పాల్గొన్నారు. Updated Date - 2021-10-15T05:18:33+05:30 IST