విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-08-21T06:07:52+05:30 IST

కొత్తపల్లి మండలం యండపల్లిలో విద్యుత్‌షా క్‌తో ఓ యువకుడు మృతి చెందిన ట్టు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. యండపల్లికి చెందిన పేర్నీ డి సురేష్‌(23) స్థానికంగా రొయ్యల చెరువువద్ద కూలీగా పనిచేసేవాడు.

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

కొత్తపల్లి, ఆగస్టు 20: కొత్తపల్లి మండలం యండపల్లిలో విద్యుత్‌షా క్‌తో ఓ యువకుడు మృతి చెందిన ట్టు సమాచారం. స్థానికుల కథనం ప్రకారం.. యండపల్లికి చెందిన పేర్నీ డి సురేష్‌(23) స్థానికంగా రొయ్యల చెరువువద్ద కూలీగా పనిచేసేవాడు. రోజు వారీ విధుల్లో భాగంగా గురువారం రాత్రి విధులకు హాజరైన సురేష్‌ చెరువులో నీరు తోడే నిమిత్తం మోటార్లను ఆన్‌చేసేందుకు వెళ్లాడు. చెరువుగట్లపై పడి ఉన్న విద్యుత్‌వైర్లు అతడి కాలికి తగిలి షాక్‌కు గురయ్యాడు. అతడ్ని స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకె ళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా మృతదేహా న్ని కుటుంబసభ్యులు రాత్రికి రాత్రి ఖననం చేసినట్టు సమాచారం. ఈ విషయంపై తమకు ఎటువంటి సమాచారం లేద ని ఎస్‌ఐ అబ్దుల్‌ తెలిపారు. గుట్టుచప్పుడుకాకుండా అంత్యక్రియలు నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోను ఇక్కడే ఓవ్యక్తి విద్యుత్‌షాక్‌తో మృతిచెందడం గమనార్హం.

Updated Date - 2021-08-21T06:07:52+05:30 IST