రైతులు పంట మార్పిడి చేపట్టాలి

ABN , First Publish Date - 2021-08-20T05:52:59+05:30 IST

రైతులు పంట మార్పిడి చేపట్టాలని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎన్‌.విజయకుమార్‌ పేర్కొన్నారు.

రైతులు పంట మార్పిడి చేపట్టాలి

రాజమహేంద్రవరం రూరల్‌, ఆగస్టు 19: రైతులు పంట మార్పిడి చేపట్టాలని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎన్‌.విజయకుమార్‌ పేర్కొన్నారు. వరికి బదులుగా బోర్ల కింద ఆరుతడి పంటలు పండించేందుకు వ్యవసాయశాఖ అధికారులు రైతులను చైతన్యవంతం చేయాలన్నారు. గురువారం స్థానిక వ్యవసాయశాఖ సహాయసంచాలకుల కార్యాలయంలో రాజమహేంద్రవరం, కోరుకొండ సబ్‌డివిజన్‌ ఏడీలు, వ్యవసాయాధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నెల 25 నాటికి వరినాట్లు, ఈ-పంట నమోదు కూడా పూర్తి చేయాలని జేడీ చెప్పారు. గ్రామస్థాయిలో సర్పంచ్‌లతో సత్సంబంధాలు కలిగి ఉంటూ వ్యవసాయశాఖ పథకాల వివరాలు ఎప్పటికపుడు వారికి తెలియజేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి రైతుల గ్రూపులను త్వరగా ఏర్పాటు చేయాలని జేడీ చెప్పారు. కార్యక్రమంలో ఏడీలు కె.సావిత్రి, పి.మల్లిఖార్జునరావు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-20T05:52:59+05:30 IST