మహిళల భద్రతకు పెద్దపీట వేయాలి

ABN , First Publish Date - 2021-08-03T05:59:00+05:30 IST

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసులలో దిశ చట్టం ద్వారా వారం రోజుల్లోపు విచారణ పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేయాలని, మహిళల భద్రతే ధ్యేయంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశించారు.

మహిళల భద్రతకు పెద్దపీట వేయాలి

కాకినాడ క్రైం, ఆగస్టు 2: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసులలో దిశ చట్టం ద్వారా వారం రోజుల్లోపు విచారణ పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేయాలని, మహిళల భద్రతే ధ్యేయంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పెద్దాపురం, రామచంద్రపురం, చింతూరు సబ్‌ డివిజన్‌ల డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ యాప్‌పై జిల్లాలో విస్త్రృతంగా అవగాహన కల్పించి 10 లక్షల మంది మహిళలు, యువతులు, బాలికలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామ,వార్డు సచివాలయాలను సందర్శించి మహిళా పోలీసులతో మాట్లాడి సమస్యలు తెలుసుకోవాలన్నారు. త్వరలోనే గ్రామ మహిళా పోలీసులకు డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ నిర్వహించి ప్రొబేషన్‌ డిక్లయిర్‌ చేయనున్నట్లు చెప్పారు. పాఠశాలలు, కాలేజీలు, సమస్యాత్మక ప్రాంతాల్లో  పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఆగస్టు 14వ వరకు అమల్లో ఉన్న రాత్రి కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. అడ్మిన్‌ ఏఎస్పీ కరణం కుమార్‌, ఎస్‌బీ డీఎస్పీలు ఎం.అంబికాప్రసాద్‌, ఎం.వెంకటేశ్వరరావు, డీసీఆర్‌బీ సీఐ ఎస్‌.లక్ష్మణరావు, ఐటీ కోర్‌ సీఐ పి.రామచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T05:59:00+05:30 IST