క్రెడిట్‌కార్డు అప్‌డేట్ పేరుతో ఖాతాలో సొమ్ము ఖాళీ
ABN , First Publish Date - 2021-11-28T06:18:17+05:30 IST
క్రెడిట్‌కార్డు అప్‌డేట్ పేరుతో బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును ఒక సైబర్ నేరస్తుడు ఖాళీ చేశాడు.

పి.గన్నవరం, నవంబరు 27: క్రెడిట్‌కార్డు అప్‌డేట్ పేరుతో బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును ఒక సైబర్ నేరస్తుడు ఖాళీ చేశాడు. ముంగండపాలెం శివారు ఉలిశెట్టివారిపాలేనికి చెందిన ఉలిశెట్టి వీరబాబుకు ఈనెల11న ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి మీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డును అప్‌డేట్ చేయాలని, అందుకోసం ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని యాప్ పేరును సూచించాడు. దీంతో వీరబాబు తన సెల్‌ఫోన్‌లో ఆ యాప్‌ను డౌన్ లోడ్ చేశాడు. వెంటనే ఆ గర్తుతెలియని వ్యక్తి వీరబాబు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము రూ.89,500ను అదేరోజు నాలుగు దపాలుగా కాజేశాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి తన ఖాతా లావాదేవీలు నిలిపివేయాలని సూచించాడు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జి.సురేంద్రతెలిపారు.