సమరశీల పోరాటాలు సాగించాలి
ABN , First Publish Date - 2021-12-16T05:28:20+05:30 IST
రామచంద్రపురం గడ్డపై జరుగుతున్న సీపీఎం మహాసభల స్ఫూర్తితో భవి ష్యత్తులో సమరశీల పోరాటాలు సాగించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.

సీపీఎం జిల్లా మహాసభల్లో నేతలు
రామచంద్రపురం,
డిసెంబరు 15: రామచంద్రపురం గడ్డపై జరుగుతున్న సీపీఎం మహాసభల స్ఫూర్తితో
భవి ష్యత్తులో సమరశీల పోరాటాలు సాగించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు.
పట్టణంలోని రాజగోపాల్ ప్రాం గణం, జానకీరామ్‌నగర్‌లో జిల్లా నాయకులు
దివంగత వాసంశెట్టి సూర్యారావు వేదికపై బుధవారం సీపీఎం 23వ జిల్లా
మహాసభలు ప్రారంభమయ్యాయి. ముందుగా సీపీ ఎం సీనియర్ నాయకుడు మేకా
సుబ్బారావు పార్టీ జెండాను ఆవిష్కరించి అమరవీరుల స్థూపానికి నివా
ళులర్పించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు జి.బేబీరాణి, కరణం ప్రసాదరావు
అధ్యక్షత వహించిన ఈ సభలో విశాఖ నగర కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావ్
మాట్లాడుతూ కరోనాతో ప్రపంచమంతా సంక్షోభంలో ఉన్న సందర్భంలో కొందరు బూర్జువా
పాలకపక్షాలు దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం
చేశారు. కరోనా మహమ్మారితో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా పార్టీ అనేక
సహాయ కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. కరోనాను సంపూర్ణంగా అంతమొందించడంలో
మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. టీడీపీ, జనసేన, వైసీపీలు
దోబూచులాట ఆడుకుంటున్నాయని విమర్శించారు. మోదీ పాలన అస్తవ్యస్తంగా ఉన్న
పరిస్థితుల్లో పవన్‌కల్యాణ్ చెక్క భజన చేయడం సరికాదన్నారు. కేంద్రంలో,
రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరుగతున్నా వాటిని నియ ంత్రించడంలో కేంద్ర,
రాష్ట్ర ప్రభు త్వాలు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ
సభ్యురాలు సుబ్బ రావమ్మ మాట్లాడుతూ ఈ మహా సభల స్ఫూర్తితో జిల్లా
ఉద్యమాన్ని, రాష్ట్ర ఉద్య మంగా విస్తరిస్తామని తెలి పారు. సమావేశంలో
డాక్టర్ చెలికాని స్టాలిన్ సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కేఎస్
శ్రీనివాస్, దువ్వా శేషబాబ్జి, ప్రజా నాట్య మండలి కళాకారులు రొంగల
వీర్రాజు, కేదారి నాగు, జె.ఎస్.కె. శ్రీనివాస్, పలివెల వీరబాబు, మలకా
రమణ, నూకల బలరాం, కృష్ణవేణి, పి.సత్యవతి తదితరులు మహాసభల్లో పాల్గొన్నారు.