ఆవులను తరలిస్తున్న వ్యాన్ సీజ్
ABN , First Publish Date - 2021-01-20T06:26:39+05:30 IST
కొత్తపల్లి, జనవరి 19: ఆవులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ను కొత్తపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి నుంచి

కొత్తపల్లి, జనవరి 19: ఆవులను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్‌ను కొత్తపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా ఆవులను ఉప్పాడ బీచ్‌రోడ్డు గుండా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కొత్తపల్లి ఎస్ఐ అబ్దుల్ నబీ మంగళవారం వాహనాలను తనిఖీ చేశారు. 24 ఆవులతో హైదరాబాద్ వెళ్తున్న మినీ వ్యాన్‌ను గుర్తించారు. దేవేంద్ర, రమణలను అరెస్టు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. ఆవులను మల్లిసాలలోని గోశాలకు తరలిస్తామని చెప్పారు.