18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ డ్రైవ్
ABN , First Publish Date - 2021-08-25T05:31:58+05:30 IST
కాకినాడ సిటీ, ఆగస్టు 24: జిల్లాలో 18 నుంచి 44 ఏళ్ల వయస్సు గల వారి కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.హరికిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. గత జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు అధికసంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాలు, వార్డుల్లో తొలుత ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ గ్రామాలు, వా

ఆధార్, ఏదైనా గుర్తింపుకార్డు అవసరం
కలెక్టర్ హరికిరణ్
కాకినాడ సిటీ, ఆగస్టు 24: జిల్లాలో 18 నుంచి 44 ఏళ్ల వయస్సు గల వారి కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సి.హరికిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. గత జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు అధికసంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాలు, వార్డుల్లో తొలుత ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ గ్రామాలు, వార్డుల్లో టీకాల పంపిణీ పూర్తయ్యాక జిల్లాలో కొవిడ్ పాజిటివ్ కేసులు ఎక్కువ నుంచి తక్కువ నమోదైన అన్ని గ్రామా లు, వార్డులకు దశలవారీగా విస్తరిస్తామని చెప్పారు. అత్యధిక కొవిడ్ పాజిటివ్ నమోదైన 90 గ్రామ పంచాయతీలు, వార్డుల్లో మంగళవారం 18 నుంచి 44 ఏళ్లవారికి వ్యాక్సినేషన్ నిర్వహించామన్నారు. మిగిలిన వారికి బుధవారం టీకాల పంపిణీ జరుగుతుందన్నారు. ఇందు కు మొత్తం లక్షా10వేల వ్యాక్సిన్ డోసులు కేటాయించగా సుమారు 70వేలమంది టీకాలు పొందారని ఆయన తెలిపారు. ఈ టీకాలు పొందేందుకు ప్రత్యేకంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదని ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపుకార్డు గాని వెంట తెచ్చుకుని వ్యాక్సినేషన్ కేంద్రా ల్లో టీకాలు వేయించుకోవచ్చని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 25,93,265 డోసులు వ్యాక్సిన్ పంపిణీ చేయగా, ఇందులో 19,77,329 మందికి మొదటిడోసు, 6,15,936 మందికి రెండో విడతల డోసుల టీకాలు వేశామన్నారు. 45 సంవత్సరాలు, ఆపై వయసు గల 13,21, 510 మంది కొవిడ్ టీకాలు పొందడంతో ఈ విభాగంలో 91 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని తెలిపారు. అలాగే 1,56,448 మంది కొవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 48,805 మంది హెల్త్‌కేర్ వర్కర్లు వ్యాక్సినేషన్ పొందారన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 16,845 మంది గర్భిణిలు, 2,83,476 మంది 5ఏళ్లలోపు పిల్లలున్న తల్లులకు, 30,156 ఉపాధ్యాయులకు, ఉద్యోగాలు, ఇతర అత్యవసర పనుల కోసం విదేశాలకు వెళ్తున్న 8,941 మందికి ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా కొవిడ్ టీకాలు పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు.