కొవిడ్‌ బాధితులకు పౌష్టికాహారం అందించాలి

ABN , First Publish Date - 2021-05-02T05:42:32+05:30 IST

కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో బాధితులకు మెరుగైన వైద్యసేవలతోపాటు మంచి పౌష్టికాహారం అందించి త్వరగా కోలుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కొవిడ్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌ జిల్లా ప్రత్యేకాధికారి జె.శ్యామలరావు అధికారులకు సూచించారు.

కొవిడ్‌ బాధితులకు పౌష్టికాహారం అందించాలి

  • బొమ్మూరు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ప్రత్యేకాధికారి శ్యామలరావు

రాజమహేంద్రవరం అర్బన్‌, మే 1: కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో బాధితులకు మెరుగైన వైద్యసేవలతోపాటు మంచి పౌష్టికాహారం అందించి త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని కొవిడ్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌ జిల్లా ప్రత్యేకాధికారి జె.శ్యామలరావు అధికారులకు సూచించారు. శనివారం బొమ్మూరు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఆయన సందర్శించి, బాధితులకు అందిస్తున్న పౌష్టికాహారం, వైద్యసేవలు, పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. బాధితులు త్వరగా కోలుకునే విధంగా చర్యలు చేపట్టి కొవిడ్‌ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించాలని వైద్యాధికారులకు సూచించారు. కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో పడకల సంసఖ్య పెంచాలన్నారు. ఆయన వెంట సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి, నోడల్‌ అధికారి నాగభూషణం, ఆర్‌ఎంవో అశోక్‌కుమార్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-05-02T05:42:32+05:30 IST